అమ్మ దానిమ్మ బత్తాయో...పవన్ కళ్యాణ్ ఈ స్టేట్ కి గొప్ప
on Jun 7, 2025
పృద్వి రాజ్ అంటే ఇండస్ట్రీలో స్పెషల్ డైలాగ్స్ తో బాగా పాపులర్ ఐన నటుడు. ఖడ్గం మూవీలో "30 ఇయర్స్ ఇండస్ట్రీ" డైలాగ్ తో అలాగే యమగోల.. అల్లరి నరేష్ మూవీలో "అమ్మ దానిమ్మ బత్తాయో" డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా ఆయన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. "పాలిటిక్స్ లో తప్ప ఎందులోనూ నేను వేలు పెట్టను. బోర్డర్ లో ఫ్రంట్ లైన్ సోల్జర్స్ యుద్ధం చేయడానికి అనుక్షణం రెడీగా ఉంటారు. ప్రతీక్షణం వాళ్ళు దేశానికీ కాపలా కాస్తుంటారు. బోర్డర్ లో ఉండే సైనికుడు ఎంత గొప్పో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్ కి అంత గొప్ప. పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాఫ్. ఇక మా హిందూపూర్ బాలయ్య గారంటే ఎన్నికలు రాకముందే నేను చెప్పా. హ్యాట్రిక్ బాలయ్య. నిజంగా డౌన్ టు ఎర్త్. ఎవరి గురించి ఆయన డిస్కస్ చేయరు. వాళ్ళ నాన్న గారి చిత్రాలు, పాటలు వింటూ చూసుకుంటూ ఉంటారు తప్పితే వేరే క్రిటిసిజం అనేది ఆయన దగ్గర ఉండదు. అమ్మ దానిమ్మ బత్తాయో అనే డైలాగ్ బాగా ఎలా హిట్ అయ్యిందంటే యమగోల మూవీలో అల్లరి నరేష్ యముడి కూతురిని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్తాడు. కింద నుంచి కెమెరా రోల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ ఉంటే బాగుంటుందని అనేసరికి అది డబ్బింగ్ లో నేను అమ్మ దానిమ్మ బత్తాయో అని అన్నా. అంతే బాగా వైరల్ ఐపోయింది.
నేను హీరోగా చేస్తే హీరోయిన్ గా తమన్నా ఐతే బాగుంటుంది అనుకున్నా. ఆవిడ మంచి ఆర్టిస్ట్. మహేష్ బాబుతో యాడ్ చేసింది. అందులో మహేష్ బాబు ఒళ్ళో పడేటప్పుడు, ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసి అమ్మ దానిమ్మ బత్తాయో ఇలాంటమ్మాయితో హీరోగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఖడ్గం మూవీ షూటింగ్ కోసం రామకృష్ణ స్టూడియోస్ కి వెళ్లాం. 30 ఏళ్ళ నాటకానుభవం ఉన్న పుస్తకం ఒకటి వచ్చింది పావలా శ్యామల గారిది. ఆ లైట్ ఏంటి అని అడిగేసరికి బటర్ పేపర్ ఇక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ మాకు తెలీదా అన్నాను దాంతో లైట్ బాయ్స్ అంతా గొల్లుమని నవ్వుతున్నారు. అది కూడా అర్ధరాత్రి 1 గంటకు మొదలైన షూటింగ్. దాంతో ఈ డైలాగ్ బాగుంది కదా కంటిన్యూ ఐపో అన్నారు అలాగే ఆ డైలాగ్ వైరల్ అయ్యింది" అని చెప్పాడు పృద్వి రాజ్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
